ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం | Australian held at IGIA for carrying live bullets in bag | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

Nov 15 2016 7:17 PM | Updated on Sep 4 2017 8:10 PM

ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లైవ్ బుల్లెట్లు తీసుకెళ్తున్న ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగేజిలో అతడు ఈ బుల్లెట్లు తీసుకెళ్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. వియన్నా నుంచి గోవా వెళ్లేందుకు ముందుగా ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియన్ పౌరుడిని సాధారణంగా చెక్ చేసినప్పుడు అతడి బ్యాగేజిలో 5.56ఎంఎం లైవ్ బుల్లెట్లు దొరికాయని వివరించారు. 
 
అతడి పేరు డబ్ల్యు జోషెడ్ అని, గోవా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ బుల్లెట్లు తీసుకెళ్లడానికి అతడి వద్ద తగిన పత్రాలు ఏవీ లేవని, అందుకే అదుపులోకి తీసుకుని, ఢిల్లీ పోలీసులకు అప్పగించామని అన్నారు. భారతదేశ చట్టాల ప్రకారం విమానంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకెళ్లడం నేరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement