
మోదీజీ.. నేను రాహుల్ ని కాదు!
'నన్ను బెదిరించాలని, లొంగదీసుకోవాలని ఆయన (ప్రధాని) అనుకుంటున్నారు. గౌరవనీయులైన నరేంద్రమోదీ గారు.. మీరు ఏమైనా చేసుకోండి కానీ నన్ను ఆపలేరు..
'నన్ను బెదిరించాలని, లొంగదీసుకోవాలని ఆయన (ప్రధాని) అనుకుంటున్నారు. గౌరవనీయులైన నరేంద్రమోదీ గారు.. మీరు ఏమైనా చేసుకోండి కానీ నన్ను ఆపలేరు. సులువుగా భయపడటానికి నేను రాహుల్ గాంధీని, సోనియాగాంధీని కాను. మీతో రాజీ పడటానికి నేను రాబర్ట్ వాద్రా కాను' అంటూ ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. వాటర్ ట్యాంకర్ కుంభకోణంలో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కేజ్రీవాల్ భగ్గుమన్నారు.
ప్రధాని మోదీ తరఫున తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దమ్ముంటే తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. కేజ్రీవాల్ మంగళవారం విలేకరులతో మాట్లాడాతూ.. ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. 'ప్రధాని మోదీ తరఫున నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది అతి పెద్ద మోసం. తన ప్రత్యర్థులను బెదిరించడానికి మోదీ సీబీఐను పావుగా వాడుకుంటున్నారు. అయినా, ఆయన తప్పుడు చర్యలపై నేను గళమెత్తుతూనే ఉన్నాను' అని అన్నారు.