
ప్రత్యేక శిక్షణలో 1150 మంది ఉగ్రవాదులు
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1150మంది ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్థాన్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
శ్రీనగర్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1150 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్థాన్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈవిషయాన్ని భారత ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మొత్తం 17 శిక్షణా క్యాంపుల్లో కొన్ని గ్రూపులుగా విడిపోయి ఉగ్రవాద కార్యకలాపాలకోసం వారు కఠోర శిక్షణ పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉందని వారు చెప్తున్నారు.
శ్రీనగర్కు చెందిన 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా ఈ విషయంపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నియంత్రణ రేఖ వెంబడి మొత్తం 23 చోట్ల లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయని, ఆ ప్రాంతంలో 315 మంది నుంచి 325 వరకు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.