మిసెస్ ఇండియాగా ఆర్మీ అధికారి భార్య | Army officer's wife wins beauty pageant | Sakshi
Sakshi News home page

మిసెస్ ఇండియాగా ఆర్మీ అధికారి భార్య

Oct 21 2014 12:52 PM | Updated on Sep 2 2017 3:13 PM

మిసెస్ ఇండియాగా ఆర్మీ అధికారి భార్య

మిసెస్ ఇండియాగా ఆర్మీ అధికారి భార్య

ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన మిసెస్ ఇండియా 2014 పోటీల్లో ఆర్మీ అధికారి భార్య అమాన్ గ్రేవాల్ విజేతగా నిలిచింది.

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన మిసెస్ ఇండియా 2014 పోటీల్లో ఆర్మీ అధికారి భార్య అమాన్ గ్రేవాల్ విజేతగా నిలిచింది. పాటియాలా నుంచి వచ్చిన గ్రేవాల్ 31 మంది సహచర పోటీదారుల్ని ప్రక్కకు నెట్టి టైటిల్ ను చేజిక్కించుకుంది. సోమవారం సాయంత్రం ఇక్కడ జరిగిన ఈ పోటీల్లో ఆమె విజేతగా నిలవడంతో పాటు రూ.51 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది.

 

ఈ సందర్భంగా గ్రేవాల్ మాట్లాడుతూ.. నా కుటుంబంలో ప్రతీ ఒక్కరూ నాకు సహకరించారు. నాకు తొమ్మిదిన్నర ఏళ్ల  కూతురు ఉంది. పోటీ జరిగే క్రమంలో నా డ్రెస్ అప్ ను చూసి నా కూతురు ఆశ్చర్యానికి గురైంది. ఈ అవార్డు రావడం పట్ల నా కూతురు కూడా చాలా సంతోషంగా ఉంది'అని స్పష్టం చేసింది.  తనకు ఒక కొడుకు కూడా ఉన్నట్లు గ్రేవాల్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement