'అత్యాచార కేసుతో ఆ పార్టీకి సంబంధం లేదు' | Amitabh Thakur Rape Case: No Links With Samajwadi Party, Says Woman's Husband | Sakshi
Sakshi News home page

'అత్యాచార కేసుతో ఆ పార్టీకి సంబంధం లేదు'

Jul 18 2015 7:04 PM | Updated on Jul 28 2018 8:40 PM

అమితాబ్ థాకూర్ ఫైల్ ఫోటో - Sakshi

అమితాబ్ థాకూర్ ఫైల్ ఫోటో

ఉత్తరప్రదేశ్ ఐజీ అమితాబ్ థాకూర్పై అత్యాచార కేసు నమోదు చేయడం వెనుక అధికార సమాజ్వాదీ పార్టీ ప్రమేయం లేదని బాధితురాలి భర్త చెప్పారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఐజీ అమితాబ్ థాకూర్పై అత్యాచార కేసు నమోదు చేయడం వెనుక అధికార సమాజ్వాదీ పార్టీ ప్రమేయం లేదని బాధితురాలి భర్త చెప్పారు. ఐజీపై కేసు పెట్టాలని తమపై రాజకీయ నాయకులెవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

ఐజీ తనపై అత్యాచారం చేశారని, ఇందుకు ఆయన భార్య కూడా సహకరిస్తుందని ఆరోపిస్తూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ తనను ఫోన్లో బెదిరించారని అమితాబ్ థాకూర్ ఫిర్యాదు చేసిన అనంతరం ఆయనపై రేస్ కేసు నమోదైంది. దీంతో ప్రతీకార చర్యగానే ఈ కేసు పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భర్త స్పందిస్తూ.. ఏ రాజకీయ నాయకుడితోనూ తనకు సంబంధాలులేవని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement