సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ సందడి! | allu arjun at sandhy theatre | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ సందడి!

Jan 11 2017 3:53 PM | Updated on Sep 5 2017 1:01 AM

'ఖైదీ నంబర్‌ 150' విడుదల సందర్భంగా ఆర్టీఐ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో హీరో అల్లు అర్జున్‌ హల్‌చల్‌ చేశారు.

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్‌ 150' విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో హీరో అల్లు అర్జున్‌ హల్‌చల్‌ చేశారు. భార్య స్నేహారెడ్డితోపాటు చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఆయన సినిమా వీక్షించారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు.


 
ఈ సందర్భంగా స్టైలిష్‌ స్టార్‌ బన్నీ థియేటర్‌లో గుమిగూడిన మెగా అభిమానులకు అభివాదం చేసి.. అలరించారు. బన్నీ రాకతో థియేటర్ వద్ద కోలాహలం నెలకొని.. స్వల్ప తోపులాట జరిగింది. థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ చెప్పాడు. పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు కూడా తొలిరోజే సినిమాను వీక్షించారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఈ  సినిమా మెగా అభిమానులను అలరించేరీతిలో ఉందనే టాక్‌ వినిపిస్తోంది. తమిళంలో మురగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాకు రీమేక్‌గా 'ఖైదీ నంబర్‌ 150' వచ్చిన సంగతి తెలిసిందే.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement