లైంగిక ఆరోపణలతో ఎయిర్పోర్ట్ అధికారి అరెస్టు | Airport official arrested for sexually harassing passenger | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణలతో ఎయిర్పోర్ట్ అధికారి అరెస్టు

Apr 16 2015 3:26 PM | Updated on Jul 23 2018 8:49 PM

ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఇమ్మిగ్రేషన్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఇమ్మిగ్రేషన్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని బెయిల్పై విడుదల చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 18న వినోద్ కుమార్ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి హాంకాంగ్ వెళ్లేందుకు వచ్చిన బెంగళూరుకు చెందిన మహిళను మాటలతోను, చేతలతోనూ అసభ్య కరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని బుధవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం బెయిల్పై విడుదల చేశారు. అడగకూడని ప్రశ్నలు అడగడంతోపాటు ఆరోజు తనను ఫాలో అయ్యాడని, ఎస్కలేటర్పై వెళుతున్నప్పుడు కూడా వెనుకాలే వచ్చాడని ఆమె బెంగళూరు పోలీసులకు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement