ఎయిర్ ఏషియా న్యూఇయర్ బంపర్ ఆఫర్ | AirAsia India Sells Tickets From Rs. 917 In New Year Sale | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఏషియా న్యూఇయర్ బంపర్ ఆఫర్

Dec 19 2016 12:04 PM | Updated on Oct 17 2018 4:29 PM

ఎయిర్ ఏషియా న్యూఇయర్ బంపర్ ఆఫర్ - Sakshi

ఎయిర్ ఏషియా న్యూఇయర్ బంపర్ ఆఫర్

నూతన సంవత్సరాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

నూతన సంవత్సరాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. న్యూయిర్ సేల్ ఆఫర్ కింద రూ.917కే టిక్కెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ 2017 జనవరి 1వరకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఏషియా తెలిపింది. 2017 మార్చి1 నుంచి 2017 అక్టోబర్ 31వరకు మధ్య ప్రయాణాలకు ఇది వర్తించనున్నట్టు పేర్కొంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా, బెంగళూరు-హైదరాబాద్ మార్గాలలో రూ.917 టిక్కెట్ ధర అందుబాటులో ఉంటుందని, న్యూఢిల్లీ-గోవా, న్యూఢిల్లీ-బెంగళూరు మార్గాలలో టిక్కెట్ ధర రూ.2,917, రూ.2,217కు ప్రారంభమవుతుందని ఎయిర్ ఏషియా తెలిపింది.
 
అన్ని రకాల చార్జీలను కలుపుకునే ఈ ధర ఉంటుందని వివరించింది. బెంగళూరు, న్యూఢిల్లీ రెండు హబ్లుగా ఎయిర్ ఏషియా ప్రస్తుతం 11 దేశీయ మార్గాలలో తన సేవలందిస్తోంది. చండీఘర్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, పుణె, గోవా, వైజాగ్, కొచ్చి, హైదరాబాద్ గమ్యస్థానాలను ఇది కవర్ చేస్తోంది. బెంగళూరు నుంచి గోవా, పుణేలకు కనెక్టివిటీని పెంచడానికి అదనపు కొత్త సర్వీసులను బడ్జెట్ క్యారియర్ అందిస్తోంది. అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ కింద ఎన్ని టిక్కెట్లను అందుబాటులో ఉంచుతుందో ఎయిర్ ఏషియా ఇండియా ప్రకటించలేదు. 
 

Advertisement
 
Advertisement
Advertisement