భరత్‌ మృతి; షూటింగ్‌లో రవితేజ బిజీ! | after bharath death, raviteja goes to film shooting | Sakshi
Sakshi News home page

భరత్‌ మృతి; షూటింగ్‌లో రవితేజ బిజీ!

Jun 26 2017 5:59 PM | Updated on Sep 5 2017 2:31 PM

భరత్‌ మృతి; షూటింగ్‌లో రవితేజ బిజీ!

భరత్‌ మృతి; షూటింగ్‌లో రవితేజ బిజీ!

తన తమ్ముడు భరత్‌ అంత్యక్రియలకు రాలేనని ప్రకటించిన హీరో రవితేజ.. మరుసటిరోజే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌: తన తమ్ముడు భరత్‌ అంత్యక్రియలకు రాలేనని ప్రకటించిన హీరో రవితేజ.. మరుసటిరోజే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అందరూ ఉండికూడా అనాథలా భరత్‌ అంత్యక్రియలు జరిగాయని, చనిపోయినవారి విషయంలో మంచిచెడులు ఉండవని, రవితేజ తమ్ముణ్ని కడసారైనా చూస్తే బాగుండేదని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే హీరో షూటింగ్‌లో పాల్గొన్నారనే వార్త సంచలనంగా మారింది.

శనివారం రాత్రి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్‌ దుర్మరణం చెందారు. భరత్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నేరుగా స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. భరత్‌ అంత్యక్రియలు ముగిసి 24 గంటలైనా కాకముందే హీరో రవితేజ.. ‘రాజా ది గ్రేట్‌’ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకొంటోంది. భరత్‌ మరణం నేపథ్యంలో షూటింగ్‌ వాయిదా వేయాలని తొలుత భావించినప్పటికీ, తాను వస్తానని హీరో రవితేజ చెప్పడంతో యధావిధిగా పని జరిగినట్లు తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భరత్‌ భార్య అమెరికాలో ఉండటుండగా, ఆయన మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. కొద్దిరోజుల కిందటే భరత్‌కు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌’ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని, ఆమేరకు ఆయన తననుతాను సన్నద్ధం చేసుకుంటుండగా అనూహ్యంగా మృత్యువాతపడ్డారని సన్నిహితులు చెప్పారు. వివాహితుడైన భరత్‌కు పిల్లలు లేరు. భరత్‌ మృతి కేసుకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
(షాక్‌: అమెరికాలో భరత్‌ భార్య..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement