దర్శకుడికి కటింగ్‌ చేసిన హీరోయిన్‌! | actress gives Anurag Basu a haircut | Sakshi
Sakshi News home page

దర్శకుడికి కటింగ్‌ చేసిన హీరోయిన్‌!

Feb 5 2017 9:52 AM | Updated on Sep 5 2017 2:58 AM

హీరోయిన్లను సినీ తెరపై అందంగా చూపించేందుకు సెట్స్‌లో చాలామందే కష్టపడుతుంటారు.

హీరోయిన్లను సినీ తెరపై అందంగా చూపించేందుకు సెట్స్‌లో చాలామందే కష్టపడుతుంటారు. మేకప్‌ మ్యాన్‌లు, హెయిర్‌ స్టైలిష్టులు.. ఇలా పలువురు తెరపై భామలు అందంగా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంతమంది సెట్స్‌లో ఉన్నా.. దర్శకుడి కోసం కత్రినా కైఫ్‌ స్వయంగా హెయిర్‌ స్టైలిష్ట్‌ అవతారం ఎత్తింది. ట్రిమ్మర్ తీసుకొని డైరెక్టర్‌కు కటింగ్‌ కూడా చేసింది.

'జగ్గా జాసుస్‌' షూటింగ్‌ సెట్స్‌లో ఈ ఘటన జరిగింది. దర్శకుడు అనురాగ్‌ బసుకు ఆమె స్వయంగా ట్రిమ్మర్‌ మిషిన్‌తో కటింగ్‌ చేసింది. కత్రిన ఇలా తనపై ప్రయోగం చేస్తుండగా.. తాను ఏడుస్తూ.. భరిస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్‌లో పెట్టారు. మాజీ ప్రేమికులైన కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా 'జగ్గా జాసుస్‌' సినిమాను అనురాగ్‌ బసు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అనురాగ్‌ బసు ఇంట్లో జరిగిన గణపతి పూజలోనూ కత్రిన పాల్గొన్నది. కానీ ఆమె మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement