కూతురి క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన హీరో! | Actor Daughter Misha Learns How To Clap | Sakshi
Sakshi News home page

కూతురి క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన హీరో!

Jun 3 2017 4:18 PM | Updated on Sep 5 2017 12:44 PM

కూతురి క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన హీరో!

కూతురి క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన హీరో!

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ గారాలపట్టి మిషా మరో టాలెంట్‌ను బయటపెట్టింది.

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ గారాలపట్టి మిషా మరో టాలెంట్‌ను బయటపెట్టింది. ఇప్పటికే పాప్‌ కింగ్‌ మైఖేల్‌ జాక్సన్‌ పాటకు బుజ్జీబుజ్జీ స్టెప్పులు వేసిన ఈ బుజ్జాయి ఇప్పుడు ‘చప్పట్లు ఎలా కొట్టాలో నేర్చేసుకుందట’ . ఈ విషయాన్ని ప్రౌడ్‌ ఫాదర్‌ షాహిద్‌ మిషా చప్పట్లు కొడుతున్న వీడియోను పోస్టు చేసి టాంటాం చేశారు.

గత ఏడాది ఆగస్టులో పుట్టిన మిషా తండ్రి షాహిద్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌గా మారిపోయింది. వరల్డ్‌ డ్యాన్స్‌ డే సందర్భంగా అప్పట్లో ఈ తండ్రీకూతుళ్లు వేసిన స్టెప్పులు వీడియో సోషల్‌ మీడియాలో నెటిజన్లను అలరించింది. ఇప్పుడు తాజాగా మిషా చప్పట్టు కొడుతున్న వీడియోను కూడా నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement