ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు క్షేమం | Abducted Indians in Iraq safe: Sushma Swaraj | Sakshi
Sakshi News home page

ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు క్షేమం

Jun 19 2014 6:37 PM | Updated on Jul 11 2019 8:48 PM

ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు క్షేమం - Sakshi

ఇరాక్ లో కిడ్నాపైన భారతీయులు క్షేమం

ఇరాక్ లో కిడ్నాప్ నకు గురైన 40 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు.

ఇరాక్లో కిడ్నాప్నకు గురైన 40 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీలో ఇరాక్లో కిడ్నాపైన భారతీయల కుటుంబ సభ్యుల బృందంతో సుష్మా భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సుష్మా మాట్లాడారు.

 

కిడ్నాపర్ల చెర నుంచి భారతీయులను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఇరాక్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 40 మంది భారతీయులను జీహాదీ సున్నీ మిలిటెంట్ల మంగళవారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారంతా తుర్కిష్ నిర్మాణ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్న విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement