
50 స్థానాలు గెల్చుకుంటాం: ఏఏపీ
తొలిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) తమకు 38 నుంచి 50 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
న్యూఢిల్లీ: తొలిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) తమకు 38 నుంచి 50 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఓ న్యూస్ పోర్టల్ నిర్వహించిన రహస్య శూలశోధనతో ఇబ్బందుల్లో పడినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెల్చుకుంటామని చెబుతోంది.
తమ పార్టీ నిర్వహించిన నాలుగు, ఐదో రౌండ్ల సర్వే ఫలితాలను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఆదివారం విడుదల చేశారు. తమ పార్టీకి 35.6 శాతం ఓట్లు వస్తాయని, 38 నుంచి 50 సీట్లు గెల్చుకుంటుందని సర్వేలో తేలిందని ఆయన చెప్పారు. బీజేపీకి 27 శాతం, కాంగ్రెస్కు 26 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. ఆమ్ ఆద్మీయ పార్టీ సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారని తెలిపారు.