
ఆధార్ లేకున్నా సబ్సిడీ సిలిండర్లు
ఆధార్ నంబర్ లేకున్నా సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఆధార్ నంబర్ లేకున్నా సబ్సిడీ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ సిలిండర్ల జారీకి ఆధార్ లింకును తొలగిస్తూ వారంలో స్పష్టమైన ప్రకటన జారీ చేస్తామని పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఆధార్ తప్పనిసరి అనే నిబంధనను తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ఇకపై సబ్సిడీ సిలిండర్లను ఆధార్ లేకున్నా కొనుగోలు చేయవచ్చని మంత్రి చెప్పారు. ఒకే చిరునామాలో రెండు వంటగ్యాస్ కనెక్షన్ల విషయమై మాట్లాడుతూ.. రెండు వేర్వేరు వంట గదులు ఉన్నట్లయితే వాటిని అనుమతిస్తామన్నారు. దీనిపై వినియోగదారులు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.