దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుంది! | a quirky tale of a friendly ghost | Sakshi
Sakshi News home page

దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుంది!

Feb 6 2017 4:15 PM | Updated on Sep 5 2017 3:03 AM

దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుంది!

దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే.. ఏమవుతుంది!

సూరజ్‌ కు 'మంగళదోషం' ఉంటుంది. కాబట్టి ఓ చెట్టును పెళ్లి చేసుకోమని చెప్తారు.

సూరజ్‌ శర్మకు 'మంగళదోషం' ఉంటుంది. కాబట్టి ఓ చెట్టును పెళ్లి చేసుకోమని చెప్తారు. ఇలా చెట్టును పెళ్లి చేసుకోవడం వల్ల అతని కష్టాలు తీరడం సంగతి అటుంచి.. కొత్త కష్టాలు మొదలవుతాయి. అయిష్టంగానే చెట్టును పెళ్లి చేసుకున్న సూరజ్‌ను ఓ దెయ్యం వెంటాడటం మొదలుపెడుతుంది. ఆ దెయ్యం పేరు శశి. తాను నివసిస్తున్న చెట్టును నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి.. నువ్వు నా భర్తవని సూరజ్‌ను వెంటాడి వేధిస్తూ ఉంటుంది ఆ దెయ్యం.

ఆ మంచి దెయ్యం ఎందుకు సూరజ్‌ వెంటపడింది. ఆమె మరణం వెనుక ఉన్న కన్నీటి కథ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. అనుష్క శర్మ తాజాగా నటిస్తున్న పిల్లౌరి సినిమా చూడాల్సిందే. గతంలో 'ఎన్‌హెచ్‌10' సినిమా నిర్మించిన అనుష్క.. తాజా సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో ఫ్రెండ్లీ ఘోష్ట్‌గా అనుష్క నటిస్తుండగా.. ఆమె వల్ల చిక్కులు ఎదుర్కొనే సూర్‌గా దిల్జిత్‌ దోసాంజ్‌ నటిస్తున్నాడు. అన్షాయ్‌ లాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 2 నిమిషాల 55 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్‌ చాలా గ్రిప్పింగ్‌గా, కొత్తగా ఉండి వీక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు ఓ లుక్‌ వేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement