4 రోజులు ఓ మోస్తరు వర్షాలు | Sakshi
Sakshi News home page

4 రోజులు ఓ మోస్తరు వర్షాలు

Published Thu, May 25 2017 2:05 AM

4 రోజులు ఓ మోస్తరు వర్షాలు

► అయినా ఎండలు ఎక్కువగానే..

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 4 రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవ కాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అయినా ఎండలు మాత్రం సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగానే ఉంటాయని స్పష్టంచేసింది. ఇక బుధవారం ఎండలు మండి పోయాయి. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడదెబ్బతో 23 మంది మృతి
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో బుధవారం వేర్వేరుచోట్ల 23 మంది మృతి చెందారు. పాత వరంగల్‌ జిల్లాలో 12 మంది, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఐదుగురు, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, నాగర్‌ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కొక్క రు చొప్పున మృతి చెందారు.

బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం          ఉష్ణోగ్రత
ఆదిలాబాద్‌    45.1
నల్లగొండ       45.0
నిజామాబాద్‌    45.0
మెదక్‌         44.9
రామగుండం    44.8
మహబూబ్‌నగర్‌    44.5
హన్మకొండ    44.0
భద్రాచలం    43.6
హైదరాబాద్‌    43.2
హకీంపేట    41.8
ఖమ్మం    41.2

Advertisement
Advertisement