ఉత్తరప్రదేశ్లో 31మందిని గుండా చట్టం కింద అరెస్టు చేశారు. వీరిలో ఓ గ్రామానికి చెందిన పెద్దమనిషి కూడా ఉన్నారు.
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లో 31మందిని గూండా చట్టం కింద అరెస్టు చేశారు. వీరిలో ఓ గ్రామానికి చెందిన పెద్దమనిషి కూడా ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోవద్దని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన వీరంతా గతంలో పలు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. హత్యలకు పాల్పడటం, కిడ్నాప్లు చేయడంవంటి పలు ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక వారిని విడిచిపెడతామని చెప్పారు.