ఈ పాప..భలే అదృష్టవంతురాలు | 3-year-old girl reunites with her father after being rescued from building collapse site in #Kanpur's Jajmua | Sakshi
Sakshi News home page

ఈ పాప..భలే అదృష్టవంతురాలు

Feb 2 2017 3:16 PM | Updated on Sep 5 2017 2:44 AM

ఈ పాప..భలే అదృష్టవంతురాలు

ఈ పాప..భలే అదృష్టవంతురాలు

శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదన్నట్టు భారీ ప్రమాదంనుంచి ఓ చిన్నారి అనూహ్యంగా మృత్యువును జయించింది.

కాన్పూర్‌: శివుడి ఆజ్ఞలేనిదే  చీమ  అయినా కుట్టదన్నట్టు భారీ ప్రమాదంనుంచి ఓ చిన్నారి అనూహ్యంగా మృత్యువును జయించింది.  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భవనం కూలిన ఘటనలో  మూడేళ్ల పాప ఆశ్చర్యకరంగా గురువారం ప్రాణాలతో బయటపడింది. పాపను చాకచక్యంగా  రక్షించిన అధికారులు ఆమెను తండ్రికి అందించారు. దీంతో పాప క్షేమంపై  అప్పటివరకు ఆందోళనతో ఎదురు  చూస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉగ్వేదానికి లోనయ్యారు. శిథిలాలనుంచి  చిన్నారి క్షేమంగా ఆరోగ్యంగా బయపడడంతో అటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా నిన్న (బుధవారం) కాన్పూర్‌ లో  నిర్మాణంలో ఉన్న  ఏడంతస్థుల భవనం  ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో  చనిపోయిన వారి కార్మికులు సంఖ్య  ఆరుకు చేరింది.  సుమారు 30 మంది గాయపడ్డారు. వెంటనే ఆర్మీ, పోలీసులు రంగంలోకి శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను రక్షించే చర్యలు చేపట్టారు. అటు  ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా, పలువురు విచారం వ్యక‍్తం  చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement