సాక్షి, మేడ్చల్ జిల్లా: కౌకూర్‌లో చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఆర్కేడ్ విల్లాస్‌లో ఐదేళ్ల బాలిక అరేలియా మోజెస్‌ను సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ హత్య చేశాడు. క్లబ్‌హౌస్ వాటర్‌పంప్‌లో పడేశాడు. బండరాయికి పాప కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేసిన నిందితుడు.. పాపను హత్య చేసిన తర్వాత సికింద్రాబాద్ వెళ్లాడు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా విక్రమ్ అక్కడే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండురోజులుగా పాప ఇంటి చుట్టే అనుమానాస్పదంగా తిరిగిన విక్రమ్.. పాప వెనకాలే వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.
సెల్ సిగ్నల్ ఆధారంగా మొదట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో, తర్వాత పటాన్‌చెరు ఏరియాలో నిందితుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. నిందితుడు యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వాచ్‌మన్‌గా వెల్లడించారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రి మార్చురీకి మృతదేహం తరలించారు. పలువురు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడి పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
మేడ్చల్ జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో విల్లా ఆర్కిడ్‌లో మిల్టన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి తన కుమార్తె అరేలియా మౌజెస్ (5)తో కలిసి విల్లా నంబర్ 84లో ఉంటున్నారు. అదే విల్లాలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న విక్రమ్.. ఆ చిన్నారిని కిడ్నాప్ చేశాడు. విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తన కూమార్తె కిడ్నాప్ అయిందని పోలీసులకు తండ్రి పెర్నాండెస్ ఫిర్యాదు చేశాడు. చివరికి చిన్నారిని వాచ్‌మెన్ విక్రమ్ దారుణంగా హత్య చేశాడు.
ఇదీ చదవండి: పచ్చని సంసారంలో ‘అత్తింటి ఇల్లు’ చిచ్చు!


