ఇజ్రాయిల్ దాడుల్లో 260కు చేరిన మృతుల సంఖ్య | 27 more Palestinians killed, Gaza toll crosses 260 | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్ దాడుల్లో 260కు చేరిన మృతుల సంఖ్య

Jul 18 2014 6:51 PM | Updated on Sep 2 2017 10:29 AM

జ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చింది.

గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చింది. గత 11 రోజులుగా గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 260 మంది పాలస్తీనా వాసుల ప్రాణాలు కోల్పోయారు.  హమాస్ పాలనలోని గాజా ప్రాంతంపై గగనతలం, సముద్రతలం నుంచి బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ ఇపుడు తొలిసారిగా భూతల దాడులకు దిగింది.  పదిరోజుల దాడుల్లో దాదాపు 260మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే, ఇజ్రాయెల్‌పై పాలస్తీనా రాకెట్ దాడులు మాత్రం ఆగలేదు. తాజాగా గురువారం రాత్రి గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 27 మంది పాలస్తీనా వాసులు మరణించారు.

 

వైమానిక దాడులతోపాటుగా ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా విరుచుకుపడింది.  హమాస్ ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను తీవ్రస్థాయిలో దెబ్బతీయాలన్నదే తమ దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు, భూతల దాడులతో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హమాస్ కూడా హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement