‘బావర్చి’ లో పేకాట.. హోటల్‌ సీజ్‌! | 16 people arrested in bawarchi hotel | Sakshi
Sakshi News home page

‘బావర్చి’ లో పేకాట.. హోటల్‌ సీజ్‌!

Oct 6 2016 5:39 PM | Updated on Mar 28 2018 11:26 AM

‘బావర్చి’ లో పేకాట.. హోటల్‌ సీజ్‌! - Sakshi

‘బావర్చి’ లో పేకాట.. హోటల్‌ సీజ్‌!

పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు.

హయాత్‌నగర్: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రహస్యంగా పేకాట ఆడుతూ జల్సా చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లలోని హయత్‌నగర్‌లో ఉన్న ‘బావర్చి’ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గురువారం రట్టు చేశారు. పేకాట ఆడుతున్న 16మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ. 2.37 లక్షల నగదుతో పాటు 17 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ’బావర్చి’ హోటల్‌లో రహస్యంగా పేకాట తంతు కొనసాగుతోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గుట్టును రట్టు చేసినట్టు తెలుస్తోంది. పేకాట బాగోతం నేపథ్యంలో ’బావర్చి’ హోటల్‌ను సీజ్ చేయాలని పోలీసులు రెవెన్యూ అధికారులకు నివేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement