బాణసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి | 11 killed in explosion in crackers factory | Sakshi
Sakshi News home page

బాణసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి

May 7 2015 9:07 AM | Updated on Sep 3 2017 1:36 AM

బాణసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి

బాణసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి

పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్లోని బాణసంచా కర్మాగారంలో గురువారం పేలుడు సంభవించింది.

కోల్కత్తా: పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్లోని బాణసంచా కర్మాగారంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బాణసంచా అక్రమంగా  నిర్వహాకులు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement