ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!! | 1 million dollars US reward for information on criminal network | Sakshi
Sakshi News home page

ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!!

May 30 2014 9:23 AM | Updated on Aug 16 2018 4:36 PM

ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!! - Sakshi

ఆచూకీ చెబితే ఆరుకోట్లు మీవే!!

అర్జంటుగా మీకు కోటీశ్వరులు అయిపోవాలని ఉందా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు కోట్ల రూపాయల భారీ బహుమతి మీ కోసమే వేచి చూస్తోంది.

అర్జంటుగా మీకు కోటీశ్వరులు అయిపోవాలని ఉందా? అయితే ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు కోట్ల రూపాయల భారీ బహుమతి మీ కోసమే వేచి చూస్తోంది. ఇంత పెద్ద బహుమతి ఎవరిస్తున్నారా అనుకుంటున్నారా.. ఇంకెవరు, పెద్దన్న అమెరికానే. మధ్య ఆసియా కేంద్రంగా పనిచేస్తున్న ఓ పెద్ద క్రిమినల్ నెట్వర్క్ గురించి సరైన సమాచారం వాళ్లకు అందిస్తే, ఇంతమొత్తం బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

కమ్చైబెక్ కొల్బయెవ్ అనే ఈ నెట్వర్క్ అలాంటిది, ఇలాంటిది కాదు. డ్రగ్స్, ఆయుధాలు, అమ్మాయిల అక్రమ రవాణాతో పాటు బెదిరించి సొమ్ములు తీసుకోవడం, ఇతర నేరాలకు పాల్పడుతుందని సిన్హువా వార్తాసంస్థ తెరలిపింది.బ్రదర్స్ సర్కిల్ అనే మరో అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాతో కూడా దీనికి సంబంధం ఉంది. యూరేషియన్ నేరగాళ్ల బృందానికి చెందిన పలువురు సభ్యులు, నాయకులు కూడా ఇందులో ఉన్నారు. బ్రదర్స్ సర్కిల్ తరఫున పనిచేస్తున్నందుకు కొల్బయెవ్ గ్యాంగును అమెరికా ఎప్పుడో 2012 ఫిబ్రవరిలోనే బ్లాక్లిస్ట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement