ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు  – అడివి శేష్‌

When No One Believed, PVP Believed in Me - Advi Sesh - Sakshi

‘‘క్షణం’ సమయంలో ‘ఏముందిలే చిన్న సినిమా’ అంటూ మా ఆఫీస్‌ బాయ్‌ వాళ్ల స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడాడు. ఆ రోజే ఫిక్స్‌ అయ్యాను. చాలా తీవ్రంగా కష్టపడాలని. ‘2.0’ వెర్షన్‌లా మారిపోయాను. ఈ సినిమా అతనికే అంకితం చేస్తున్నాను’’ అన్నారు అడివి శేష్‌. పీవీపీ నిర్మాణంలో అడివి శేష్, రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ప్రీ–రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో శేష్‌ మాట్లాడుతూ – ‘‘మా స్నేహితులకు ఈ సినిమా చూపించా. నమ్మకంగా పీవీపీగారితో ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ వద్దు. ప్రీమియర్‌ షో వేద్దాం అన్నాను. నన్ను ఎవరూ నమ్మని సమయంలో ఆయన నమ్మారు’’ అన్నారు శేష్‌. ‘‘టాలెంట్‌ ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడంలో పీవీపీగారు బెస్ట్‌. నమ్మితే ప్రశ్నించరు’’ అన్నారు వెంకట్‌ రామ్‌జీ. ‘‘సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’’ అన్నారు నవీన్‌ చంద్ర’’. ‘‘కథ ఉమెన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో నడుస్తుంది. ఈ సినిమాకు ఇద్దరు అమ్మాయిలు ఆసిస్టెంట్‌ డైరెక్టర్స్‌గా చేశారు. ఒక సినిమాకి ఇద్దరమ్మాయిలు ఉండటం నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌’’ అన్నారు రెజీనా. ‘‘తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. అందులో మా సినిమా కూడా ఉండబోతోంది. మా సెట్, ఆఫీస్‌ పని చేయడానికి చాలా సురక్షితమైన ప్రదేశం అని గర్వంగా చెబుతాను’’ అన్నారు పీవీపీ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top