చెమటోడ్చిన జోకర్‌ | Novak Djokovic Advanced To Semifinal | Sakshi
Sakshi News home page

చెమటోడ్చి నెగ్గిన జకోవిక్‌

May 18 2019 12:32 PM | Updated on May 18 2019 12:57 PM

Novak Djokovic Advanced To Semifinal - Sakshi

రోమ్: టెన్నిస్‌ వరల్డ్‌ నెంబర్‌ 1 నోవాక్‌ జకోవిచ్‌ రోమ్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్‌లో ప్రవేశించాడు. శుక్రవారం రోమ్‌లో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మాజీ యూఎస్‌ చాంపియన్‌ అర్జెంటినా ఆటగాడు డెల్‌ పోట్రోపై 4-6,7-6(8-6),6-4 తేడాతో చెమటోడ్చి గెలిచాడు. మోకాలి గాయంతో గత కొంత కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న పోట్రో ఆట ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. 12 ఏస్‌లతో జోకర్‌ను బెంబేలెత్తించాడు.
ఓటమి నుంచి గెలుపు దిశగా..
మొదటి సెట్‌ గెలిచిన పోట్రో రెండో సెట్‌లోనూ దూకుడును ప్రదర్శించాడు. బేస్‌లైన్‌ షాట్స్‌ ఆడుతూ జోకర్‌కు చుక్కలు చూపించాడు. అయితే రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకున్న జకోవిచ్‌ మ్యాచ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో 8-6తో గెలిచి రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌ను గెలిచి సెమీఫైనల్‌లో ప్రవేశించాడు. సెమీఫైనల్‌లో మరో అర్జెంటీనా ఆటగాడు డియాగో ష్వార్జ్జ్టమాన్‌తో తలపడనున్నాడు.
అదృష్టంతో గట్టెక్కా..
‘‘ సరైన సమయంలో నాకు అదృష్టం తోడైంది. మొదటి సెట్‌లో పోట్రో అద్భుతంగా ఆడాడు. రెండో సెట్‌లో నేను రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత నా ఆటతీరు కాస్త గాడి తప్పింది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా తిరిగి నా పూర్వపు ఫామ్‌ను అందుకున్నానని ఆశిస్తున్నాను ’’ -జకోవిచ్‌

Advertisement
 
Advertisement
Advertisement