
కరీంనగర్ : కొమురంభీమ్ జిల్లా తిర్యాణి మండలం గుండాలలో గురువారం జరిగిన ప్రమాదంలో గాయపడి న బాధితులను కరీంనగర్‌లోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవా లక్ష్మితో కలిసి బాధితులను పరామర్శించారు. కూలీపనులకోసం ట్రాక్టర్‌పై వెళ్తుండగా.. అదుపు తప్పి బోల్తాపడడంతో ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో 12మంది గాయపడగా అందరినీ కరీంనగర్ ప్రభు త్వ ప్రధానాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం బాధితులను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో లక్ష్మి బాయి, లీల, పూలాబాయి, పార్వతి, వెన్నెల, భారతీబాయి, రంగుబాయి, కమలాబాయి, ప్రేమలత ఉన్నారు.