'ఆమె చదువుకయ్యే ఖర్చు భరిస్తాం' | YSRCP Leader Singireddy Bhaskar Reddy visits gang rape victim | Sakshi
Sakshi News home page

'ఆమె చదువుకయ్యే ఖర్చు భరిస్తాం'

Mar 1 2016 4:13 PM | Updated on May 29 2018 3:48 PM

చల్లూరులో గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలి ఉన్నత చదులకయ్యే ఖర్చు వైఎస్సార్సీపీ భరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

వీణవంక (కరీంనగర్) : చల్లూరులో గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలి ఉన్నత చదులకయ్యే ఖర్చు వైఎస్సార్సీపీ భరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం వీణవంకలో బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ఆమెకు మనో ధైర్యాన్ని కలిగించారు. ఆమె న్యాయ పోరాటానికి వైఎస్సార్సీపీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని సింగిరెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement