'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు' | ysrcp complains of irregularities in telangana mlc elections | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు'

May 27 2015 5:38 PM | Updated on Aug 29 2018 6:26 PM

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు శివకుమార్, రెహ్మాన్ బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా సదారాంను ఆ పదవి నుంచి తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పొరపాట్లు చోటుచేసుకున్నాయని, రాజా సదారాం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయనను వెంటనే తొలగించాలని కోరారు. ఎన్నికలకు ఇద్దరు పరిశీలకులను నియమిస్తామని భన్వర్లాల్ తమకు హామీ ఇచ్చారని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తామని ఆయన చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు శివకుమార్, రెహ్మాన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement