వైఎస్‌ఆర్‌సీపీ జాబితా విడుదల | ysrcp announced candidates for general elections | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ జాబితా విడుదల

Apr 9 2014 2:56 AM | Updated on Aug 21 2018 5:36 PM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా మంగళవారం అర్ధరాత్రి విడుదలైంది.

 సాక్షి, ఖమ్మం : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా మంగళవారం అర్ధరాత్రి విడుదలైంది. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పేర్లను ప్రకటించారు. అలాగే జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి వనమా వెంకటేశ్వరరావు, పినపాకకు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు తాటి వెంకటేశ్వర్లు, సత్తుపల్లికి మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, వైరాకు బాణోతు మదన్‌లాల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానానికి గుగులోతు రవిబాబు పేర్లను పార్టీ ప్రకటించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement