ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు | Youth allegedly Attacked By Octopus Police Team | Sakshi
Sakshi News home page

ఆక్టోపస్‌ పోలీసుల వీరంగం, ఫిర్యాదు

Aug 22 2019 2:51 PM | Updated on Aug 22 2019 3:20 PM

Youth allegedly Attacked By Octopus Police Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :ఆదిభట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆక్టోపస్‌ పోలీసులు మద్యం మత్తులో గతరాత్రి వీరంగం సృష్టించారు. తినేందుకు హోటల్‌కు వచ్చిన కానిస్టేబుల్స్‌.. పక్క టేబుల్‌పై ఉన్న రాము అనే యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఆ యువకుడు ప్రశ్నించగా, తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతాపం చూపించారు. అంతేకాకుండా అడ్డు వచ్చినవారిని కూడా... కానిస్టేబుల్స్‌ చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని రాము ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement