యువకుడి దారుణ హత్య | younger murdered by the unknown persons | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Jun 20 2015 10:56 AM | Updated on Jul 30 2018 8:29 PM

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలికొంది.

ప్రేమ వ్యవహారమే కారణం
ఆదిలాబాద్: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్లో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన శ్రీకాంత్  అనే యువకుడు ఓ అమ్మాయితో కొద్దిరోజులుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆ ప్రేమను పెద్దలు నిరాకరించారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే శ్రీకాంత్ హత్యకు కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement