యువకుడి బలవన్మరణం  | Young Man Committed Suicide | Sakshi
Sakshi News home page

యువకుడి బలవన్మరణం 

Jul 14 2018 1:12 PM | Updated on Oct 8 2018 5:07 PM

Young Man Committed Suicide  - Sakshi

మహేశ్‌ మృతదేహం

కల్వకుర్తి టౌన్‌ : సొంత ఇంట్లో ఓ యువకుడు ఫ్యా న్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కల్వకుర్తి లో శుక్రవారం చో టుచేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. పట్టణం లోని వాసవీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న మహేష్‌(25) అనే యువకుడు శుక్ర వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించి పోస్టుమా ర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement