కలప స్మగ్లర్‌పై పీడీ కొరడా! 

Wood Smuggling Police PD Act Cases Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే కలప స్మగ్లర్‌పై పీడీ యాక్టు నమోదు కు పోలీసు శాఖ సమాయత్తమైంది. నిజామాబాద్‌ నగరానికి చెందిన వాజిద్‌పై ఈ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు నిర్మల్‌ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత నెలలో నిర్మల్‌ పోలీసులు నమోదు చేసిన కలప స్మగ్లింగ్‌ కేసులో వాజి ద్‌ మొదటి నిందితు డు. నిజామాబాద్‌ నగరాన్ని అడ్డాగా మార్చు కుని గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అడవులను నరకడం.. కలపను స్మగ్లింగ్‌ చేయడాన్నే వృత్తిగా మార్చుకున్న ఆదిలాబాద్‌ ముల్తానీలతో వాజిద్‌ చేతులు కలిపి ఈ దందాను కొనసాగిస్తున్నారు. వాజిద్‌పై నిజామాబాద్‌ జిల్లాతో పా టు, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో వివిధ పోలీస్‌స్టేషన్లలో కలప స్మగ్లింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ పోలీస్‌స్టేషన్లలో వాజిద్‌పై గతంలో కలప స్మగ్లింగ్‌ కేసులున్నట్లు తేలింది.నిజామాబాద్‌ జిల్లాలోనూ ఇలాంటి కేసులుండటంతో పీడీ యాక్టు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే ప్రత్యేక నిబంధనలున్నాయి. వాజిద్‌పై ఉన్న కేసులను పరిశీలిస్తే పీడీ చట్టం వర్తిస్తుం దని పోలీసులు నిర్ణయానికి వచ్చారు.

పరారీలోనే డిప్యూటీ మేయర్‌..
నిజామాబాద్‌ కేంద్రంగా సాగుతున్న కలప స్మగ్లింగ్‌పై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఇం దులో భాగంగా ఆదిలాబాద్‌ వైపు నుంచి నిజామాబాద్‌ నగరానికి తరలిస్తున్న కలప వాహనాన్ని జనవరి 20న నిర్మల్‌ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. కేసు తీగ లాగితే నగరంలోని సామిల్లుల్లో గుట్టుగా సాగుతున్న కలప స్మగ్లింగ్‌ దందా బట్టబయలైంది. ఆయా సామిల్లుల్లో కలప నిల్వలను పరిశీలిస్తే అక్రమ కలప నిల్వలు బయటపడ్డాయి.

నిజామాబాద్‌ నగర డిప్యూటీ మేయర్‌ ఫయీం వంటి నేతల సామిల్లుల్లోనూ కలప స్మగ్లింగ్‌ జరిగినట్లు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌లో ఏఆర్‌ ఎస్‌ఐ షకీల్‌ పాషకు కూడా భాగస్వామ్యం ఉందని తేలడం ఆ శాఖ వర్గాల్లో కలకలం రేగిన విషయం విదితమే. ఇటు అటవీశాఖ అధికారుల హస్తం కూడా ఉండటంతో కొందరిపై వేటు పడిన విష యం తెలి సిందే. ఈ ఘటనలో మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ ఫయీంతో పాటు, సామి ల్లుల యజమానులు కూడా ఇప్పటికీ పరారీలో నే ఉన్నారు. వీరితో పాటు ఏడుగురు ముల్తానీలను సైతం పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top