నీటి కోసం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు | women protest for drinking water | Sakshi
Sakshi News home page

నీటి కోసం ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

Apr 19 2015 3:10 PM | Updated on Sep 3 2017 12:32 AM

వేసవిలో నీటి సమస్యతో సతమతమవుతున్న మహిళలు కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును నిలదీశారు.

కథలాపూర్ (కరీంనగర్): వేసవిలో నీటి సమస్యతో సతమతమవుతున్న మహిళలు కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబును నిలదీశారు. కథలాపూర్ మండలం చింతకుంట, దూలూరు చెరువుల్లో మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవానికి రమేశ్‌బాబు వెళుతుండగా... తాండ్రియాల్ గ్రామం వద్ద స్థానిక మహిళలు ఆయనను అడ్డుకున్నారు.

తాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. గ్రామంలోని బోర్లన్నీ ఎండిపోవడంతో సమీప పొలాల్లోని బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేకు వివరించారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement