ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం పెనగడప సమీపంలో ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం పెనగడప సమీపంలో ఓ యువతిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అనంతరం యువతి ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతికి 25 ఏళ్ల వయస్సు ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.