సదాశివనగర్‌లో మహిళ దారుణ హత్య | women murderd in sadshivanagar | Sakshi
Sakshi News home page

సదాశివనగర్‌లో మహిళ దారుణ హత్య

May 6 2015 10:31 AM | Updated on Jul 30 2018 8:29 PM

సదాశివనగర్ మండలం ఆమర్లబండశివారులో మల్లారి రాణి(30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు సాయిబాబా(32) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

నిజామాబాద్(సదాశివనగర్): సదాశివనగర్ మండలం ఆమర్లబండశివారులో మల్లారి రాణి(30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో పాటు సాయిబాబా(32) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి బుధవారం ఉదయం 3 గంటలకు బైక్‌పై వెళ్తున్న రాణి, సాయిబాబాలను హతమార్చాలని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

రాణి భర్త విదేశాల్లో ఉంటాడు. సాయిబాబాను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement