డీఎస్పీ కార్యాలయంలో మహిళ మృతి | women died in dsp office | Sakshi
Sakshi News home page

డీఎస్పీ కార్యాలయంలో మహిళ మృతి

May 14 2015 10:23 PM | Updated on May 25 2018 5:49 PM

భర్త పెట్టే బాధలు పోలీసులకు వివరించడానికి వచ్చిన మహిళ డీఎస్పీ కార్యాలయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

నల్గొండ: భర్త పెట్టే బాధలు పోలీసులకు వివరించడానికి వచ్చిన మహిళ డీఎస్పీ కార్యాలయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇదే జిల్లా మేళ్లచెరువుకు చెందిన అరుణ(38)కు హైదరాబాద్‌లో లెక్చరర్‌గా జీవనం సాగిస్తున్న ముసినివెంకటేశ్వర్లు(42) అనే వ్యక్తితో పదిహేనేళ్ల కిందటే వివాహమైంది. వీరు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటినుంచి భర్త మానసికంగా, శారీరకంగా వేదించడంతో విసుగు చెందిన అరుణ వారం రోజుల కిందట తల్లిగారింటికి వచ్చింది.

ఈ క్రమంలో భర్త పెట్టె వేదింపులకు సంబంధించి సూర్యపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే కార్యాలయంలోనే కుప్పకూలిపోయింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అరుణ మృతిచెందిందని వైద్యులు నిర్థరించారు. మృతురాలికి శివ, సందీప్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. ఐదేళ్ల కిందటే తండ్రి వేదింపులు తాళలేక అరుణ పెద్దకుమారుడు శివ ఇంట్లోంచి పారిపోయాడని తెలిసింది. పోలీసులు అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement