ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని.. | Woman Thrashes Husband Over Extramarital Affair In Warangal Urban | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని చితకబాదారు..!

Sep 24 2019 10:24 AM | Updated on Sep 24 2019 2:15 PM

Woman Thrashes Husband Over Extramarital Affair In Warangal Urban - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రవి ప్రియురాలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు.

సాక్షి, వరంగల్‌ : వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు ఓ భార్య చుక్కలు చూపించింది. ఇరుగుపొరుగు మహిళల సహకారంతో అతన్ని చితకబాదింది. ఈ ఘటన వరంగల్‌ పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ముత్తోజు రవికి తగిన బుద్ధి చెప్పాలని అతని భార్య సరిత నిశ్చయించుకుంది. రవి ప్రియురాలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు సదరు మహిళను చితకబాదారు. రవి, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement