లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు | woman injured in a roafd accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

Dec 15 2015 7:00 AM | Updated on Apr 6 2019 8:52 PM

లారీ ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

టేకులపల్లి: లారీ ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన  ఖమ్మం జిల్లా టేకులపల్లి బోడు రోడ్ సెంటర్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. టేకులపల్లికి చెందిన వృద్ధురాలు రాయల సక్కుబాయి ఆర్టీసీ బస్సు దిగి రోడ్డు దాటుతుండగా కేబీసీ నుంచి బీపీఎల్‌కు బొగ్గు రవాణా చేస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆమె  కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సక్కుబాయిని 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement