నిర్మల్‌ జిల్లాలో విషాదం | woman commits suicide with two children in nirmal | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లాలో విషాదం

Dec 15 2017 11:35 AM | Updated on Aug 21 2018 6:00 PM

నిర్మల్‌ జిల్లాలో విషాదం నెలకొంది.

సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని కడెం మండలం బెల్లాల్‌లో శుక్రవారం ఓ మహిళ.. ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉండే సుద్దాల లక్ష్మీ, తన ఇద్దరు పిల్లలు శ్రీజ(7), సిద్ధూ (5) లతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది. బావిలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృత దేహాలను బయటకుతీసి పోస్టంమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement