పిల్లలు కలగలేదని ఆత్మహత్య | Woman commits suicide | Sakshi
Sakshi News home page

పిల్లలు కలగలేదని ఆత్మహత్య

Oct 23 2015 6:18 PM | Updated on Nov 6 2018 7:56 PM

పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తాడ్వాయి (నిజామాబాద్) : పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం సంతాయపేటలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనిత(38)కు పెళ్లై పదిహేనేళ్లైనా పిల్లలు కలగకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement