బిడ్దకు నిప్పంటించి..ఆ తర్వాత

A Woman Attempt Suicide With Her 1 1/2Year Old Daughter: Daughter Die - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామానికి చెందిన మౌనిక మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇంట్లో తన కూతురు అద్వైత (ఏడాదిన్నర)పై కిరోసిన్‌పోసి, తాను పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తట్టుకోలేక బకెట్‌లో ఉన్న నీటిని కూతురిపై, తనపై పోసుకుని మంటలను ఆర్పేసింది. అప్పటికే పూర్తిగా కాలిపోయిన కూతుర్ని తీసుకొని బయటకు వచ్చి ఏడుస్తుండగా, గ్రామస్తులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా, పాప మృతి చెందింది. చికిత్స పొందుతున్న మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మౌనికకు నిజాంసాగర్‌ మండలం ఆరేడు గ్రామానికి చెందిన రాజుతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పదిరోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఈ అఘాత్యానికి పాల్పడింది. కాగా కార ణాలు తెలియరాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top