'అందుకే కేసీఆర్ పోలవరంపై మాట్లాడడం లేదు' | Sakshi
Sakshi News home page

'అందుకే కేసీఆర్ పోలవరంపై మాట్లాడడం లేదు'

Published Mon, Jul 14 2014 1:57 PM

'అందుకే కేసీఆర్ పోలవరంపై మాట్లాడడం లేదు' - Sakshi

హైదరాబాద్: పోలవరం బిల్లును అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ కౌన్సిల్‌ కాంగ్రెస్‌ ఉపనేత పీసీసీ మాజీ అధ్యక్షుడు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.

బిల్లును కాంగ్రెసే అడ్డుకోవాలంటున్న టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఎందుకు కోరలేదని నిలదీశారు. 1956కు ముందున్న తెలంగాణ కావాలని శ్రీకృష్ణ కమిటీకి కేసీఆర్ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ పోలవరం బిల్లుపై మాట్లాడటానికి ముందుకు రావటంలేదన్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
 
Advertisement
 

తప్పక చదవండి

Advertisement