ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి | wheres arogyasri- chinnareddy | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి

Mar 11 2015 11:32 AM | Updated on Mar 25 2019 3:09 PM

ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి - Sakshi

ఆరోగ్యశ్రీ...ఊసేది: చిన్నారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పెదవి విరిచారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ ఊసే లేదన్నారు. అలాగే మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు కేటాయించిన నిధులతో ఎప్పటికి పనులు పూర్తి చేస్తారన్నారు.

వాస్తవ పరిస్థితులను గుర్తించి నిధుల కేటాయింపులు జరగాలన్నారు. అలాగే విద్యుత్ సమస్య ఉన్నందున ఆ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలే మిగులు వ్యయం కలిగి ఉన్నాయని చెప్పుకుంటూ...మరోవైపు ప్రజలపై వ్యాట్ పెంపు చేయటం దారుణమన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement