ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు | Web Cameras in government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు

Feb 22 2016 3:49 AM | Updated on Sep 3 2017 6:07 PM

ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు

ప్రభుత్వాస్పత్రుల్లో వెబ్ కెమెరాలు

రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

 జడ్చర్ల: రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో సిబ్బంది పనితీరు, తదితర సమస్యలను పరిశీలించేందుకు వీలుగా ఈ వెబ్ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు.

ఇప్పటికే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 16 కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన తన మొబైల్ ఫోన్ ద్వారా వెబ్ కెమెరాలను లింక్‌చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగాన్ని పరిశీలించారు. వెబ్ కెమెరాలతో సిబ్బంది పనితీరులో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీంతో రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement