గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహిస్తున్న లైవ్ డెమో
సర్జరీ జరుగుతుండగానే పరికరాల లైవ్ డెమోలు
ఓటీ లైట్స్ కొనుగోలుకు టెండర్ పిలిచిన ఏపీఎంఎస్‌ఐడీసీ
బిడ్‌లు వేసిన సంస్థలకు గుంటూరు జీజీహెచ్‌లో లైవ్ డెమో
ఓ వైపు రోగులకు సర్జరీ.. మరోవైపు డెమో నిర్వహణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రోగుల భద్రత దినోత్సవం రోజు(సెప్టెంబర్ 17)నే ప్రభుత్వాస్పత్రిలో రోగుల ప్రాణాలకు భద్రత లేదని రుజువు చేసింది. వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఆపరేషన్ థియేటర్(ఓటీ)లో డెమో ప్రక్రియను నిర్వహించి రోగుల ప్రాణాల మీదకు తెచ్చేలా సర్జికల్ ప్రొటోకాల్స్‌ను ప్రభుత్వం కాలరాసింది. ప్రభుత్వాస్పత్రులకు ఓటీ లైట్‌ల కొనుగోలు కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) ఇటీవల టెండర్ పిలిచింది.
బిడ్‌లు వేసిన సంస్థల పరికరాలకు గుంటూరు జీజీహెచ్‌లో గురువారం డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు సర్జరీలు చేసే ఆపరేషన్ థియేటర్‌లోనే లైవ్ డెమో చేపట్టడం వైద్యశాఖ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. జీజీహెచ్‌లోని ఓటీలో రోగులకు సర్జరీలు జరుగుతున్న సమయంలో వెండర్స్ తమ లైట్‌లతో డెమో ఇచి్చనట్టు తెలుస్తోంది.
తీవ్ర ఇన్‌ఫెక్షన్ల ముప్పు
టెండర్ ప్రక్రియలో భాగంగా పరికరాల నాణ్యతను పరిశీలించాలంటే బయోమెడికల్ ఇంజినీరింగ్ ల్యాబ్‌లు, వైద్యుల బృందం ఖాళీగా ఉన్న మాక్ థియేటర్లలో డెమోలు నిర్వహించవచ్చు. రోగులకు సేవలు అందిస్తూ లైవ్‌లో వాటి పనితీరు చూడాలని అధికారులు నిర్ణయించినప్పుడు సర్జరీ ప్రొటోకాల్స్ ప్రకారం పరికరాలను స్టెరిలైజ్ చేసి రోగుల ఆరోగ్యానికి ఇబ్బందుల్లేకుండా డెమో నిర్వహించాలి. ఇలాంటి జాగ్రత్తలేమీ తీసుకోకుండా నాలుగైదు కంపెనీల పరికరాలు, ఆయా కంపెనీల ప్రతినిధులతోపాటు వైద్యులు, సిబ్బంది గుంటూరు జీజీహెచ్ ఓటీలో పరేడ్ నిర్వహించినట్టు సమాచారం.
ఓటీ అత్యంత కఠినమైన స్టెరైల్(క్రిమిరహిత) వాతావరణంలో ఉండాలి. వెండర్స్, బయోమెడికల్ ఇంజినీర్లు ప్రవేశించి ఓటీ లైట్స్‌ను బయటకు, లోపలికి తిప్పడంతో స్టెరైల్ వాతావరణం కలుíÙతమై రోగులకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. ఇది ప్రాణాంతక సెప్సిస్‌కు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం స్టెరైల్ చేయని వైద్య పరికరాలను ఓటీల్లోకి అనుమతించడం నిషేధం. అయినా ఓటీలోనే లైవ్ డెమోలు నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


