పెట్రోల్‌లో నీళ్లు.. | Water Mixing in Chaithanyapuri HP Petrol Bunk | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌లో నీళ్లు..

Jul 23 2019 9:35 AM | Updated on Jul 23 2019 10:55 AM

Water Mixing in Chaithanyapuri HP Petrol Bunk - Sakshi

ఆందోళన చేస్తున్న వాహనదారులు

చైతన్యపురి: చైతన్యపురిలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోలు వస్తుందని వాహనదారులు సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ పోయించుకోగానే స్టార్ట్‌ చేయటానికి ప్రయత్నించిన వాహనాలు మొరాయించడంతో అనుమానం వచ్చిన ద్విచక్రవాహన దారులు బాటిళ్లలో పెట్రోల్‌ పోయించుకున్నారు.  బాటిల్‌ అడుగులో నీరు, పైన పెట్రోలు ఉండటాన్ని గుర్తించి  ఆందోళనకు దిగారు. అంతకు ముందు పెట్రోలు పోయించుకున్న పలువరు వాహనాలు ఆగిపోవటంతో బంక్‌ వద్దకు చేరుకున్నారు.  పెద్ద సంఖ్యలో వాహనదారులు బంక్‌ వద్ద బైటాయించి ఆందోళనకు దిగారు. గతంలోనూ ఇదే పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయని,  కల్తీ చేస్తున్న బంక్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడికి చేరుకున్న చైతన్యపురి పోలీసులు ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐసాయి ప్రకాష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement