వక్ఫ్‌ బోర్డు కార్యాలయం సీజ్‌ అన్యాయం  | Wakf Board Office Siege is unfair | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బోర్డు కార్యాలయం సీజ్‌ అన్యాయం 

Nov 11 2017 2:43 AM | Updated on Aug 31 2018 8:34 PM

Wakf Board Office Siege is unfair - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వక్ఫ్‌ బోర్డును సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. వక్ఫ్‌ బోర్డు, అందులోని రికార్డులను ఈ నెల 8, 9 తేదీల్లో మైనార్టీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సీజ్‌ చేయడం చట్ట వ్యతిరేకమంటూ న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్‌ పిల్‌ దాఖలు చేశారు. ఇందులో ఆ ముగ్గురు అధికారులతోపాటు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారిని ప్రతివాదులుగా చేర్చారు.

ఈ నెల 7న అర్ధరాత్రి నాంపల్లిలోని వక్ఫ్‌ బోర్డు కార్యాలయాన్ని, రికార్డులను అధికారులు సీజ్‌ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని హైకోర్టును కోరారు. వక్ఫ్‌ బోర్డు యాక్ట్‌ ప్రకారం కార్యాలయం, రికార్డులు సీజ్‌ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, వక్ఫ్‌ బోర్డు పాలక మండలిని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించే అధికారం మాత్రమే ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement