వీఆర్‌ఏ హత్య : గ్రామంలో ఉద్రిక్తత | VRA brutally murdered in Pulimamidi village | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏ హత్య : గ్రామంలో ఉద్రిక్తత

May 31 2015 11:55 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా హాలియా మండలం పులిమామిడి గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ) డి.గిరి(24) ఆదివారం ఉదయం హత్యకు గురయ్యాడు.

హాలియా:  నల్లగొండ జిల్లా హాలియా మండలం పులిమామిడి గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్‌ఏ) డి.గిరి(24) ఆదివారం ఉదయం హత్యకు గురయ్యాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం ఉదయం వీఆర్‌ఏ గిరి వాగు సమీపంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో స్థానికుడు నకిరికంటి నగేష్(24) ఎదురు కాగా, వారి మధ్య వివాదం నెలకొంది. మాటా మాటా పెరగడంతో గిరిపై నగేష్ కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన గిరి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న గిరి సంబంధీకులు ఆగ్రహంతో నగేష్ స్నేహితులు, బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు. ఓ ఇంటికి నిప్పటించడంతోపాటు మరో మూడిళ్లపై దాడి చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామంలోకి రంగ ప్రవేశం చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌కుమార్ కూడా సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా వాగు నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే గిరిని హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement