తుదకు ప్రచారం.. హామీలే బేరం

The Votes Of The Communities That Are Crucial - Sakshi

అంచనాల్లో అభ్యర్థులు 

విజయంపై ఎవరి ధీమా వారిదే

కీలకం కానున్న సంఘాల ఓట్లు

సాక్షి, కెరమెరి: ఎన్నికల నేపథ్యంలో అత్యంత కీలకమైన సమయం దగ్గర పడుతుంది. ఫలితంగా ప్రచారం రోజురోజుకి హోరెత్తుతుంది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు, తమ పార్టీల నాయకులు, కార్యకర్తుల, కుటుంభ సభ్యులతో కలిసి పల్లెలను జల్లెడ పడుతున్నారు. దీంతో ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల వేడి వేడెక్కింది. ప్రచార రథాలపై మైక్‌ సెట్‌ సౌండ్‌లతో ప్రజలకు అర్థమెయ్యోలా ప్రచారం సాగిస్తున్నారు. అభివృద్ధి, కార్యక్రమాలు, మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఇంటింటా పార్టీ గుర్తులను ఓటర్లకు చేర్పించేందుకు తాపత్రయ పడుతున్నారు. అభ్యర్థులతో పాటు ద్వితియ శ్రేణి నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు ప్రచారంలో అమ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటున్నారు. ఉదయం 6 గంట లనుంచి ప్రచారం ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తున్నారు. 
  
ఓటర్లను  ఆకర్శించేలా ప్రచారం 
ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లను వేడుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఎత్తుగడలను గమనిస్తూ పాచికలు వేస్తున్నారు. చేసిన అభివృద్ధి పథకాలు వివరిస్తూ , టీఆర్‌ఎస్‌ నెరవేర్చని హామీలపై కాంగ్రెస్‌ ప్రచారాస్త్రాలు వేస్తున్నారు. మిగిలిన బీజేపీ, బీఎస్పీ, టీజేఎస్‌ అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేపడుతున్నారు. గతంలో చేసిన అభివృద్ధి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుంటూ ప్రజల్లో దూసుకెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే చేసే పనుల హామీలను గుప్పిస్తున్నారు.   

సంఘాల పైనే దృష్టి 
గెలుపుకోసం నాయకులు, కుల సంఘాలపై దృష్టి సారించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాత్రి వేళల్లో ప్రత్యేకంగా కలుస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. సంఘం భవనాలు నిర్మస్తామని, ఆయా కాలనీల్లో అభివృద్ది పనులు చేస్తామని హమీలిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే సంఘాల అభివృద్దికి పాటుపడతామని భరోసా కల్పిస్తున్నారు. ప్రచారంలో తిరిగే వారికి ప్రతి రోజు అల్పాహారం, భోజనం, టీ, కాఫీలను అందించడంతో పాటు రాత్రి పూట వేళల్లో విందులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top